సిద్దిపేట, మే 13: ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరూ ఓటు వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేటలోని అంబిటాస్ సూల్ 114వ పోలింగ్ కేంద్రంలో హరీశ్‌రావు కుటుంబ సమేతంగా ఓటుహకును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ముమ్మురంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, గతంలో కంటే పట్టణంలోనే ఎకువ పోలింగ్ జరిగిందన్నారు. ప్రశ్నించే గొంతుతో ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, మేధావులు, విద్యావంతులు పోలింగ్‌లో పాల్గొనాలని హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఆయనవెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.