సిద్దిపేట,ఆగస్టు 25: సిద్దిపేట పట్టణంలో కొరి వి కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటు చేసుకోవ డం సంతోషంగా ఉన్నదని..అతడి స్ఫూర్తితో ముదిరాజ్‌లు ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని మాజీమంత్రి సిద్దిపేట, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి విగ్రహావిష్కరణలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ముదిరాజ్ సంఘం సభ్యుడు పిట్ల నగేశ్ తదితరులతో కలిసి ఆయ న పాల్గొన్నారు.
కృష్ణస్వామి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. కొరివి కృష్ణస్వామి హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నో సేవలు అందించి ముదిరాజ్‌లకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా రెండు ఎకరాల స్థలంలో సిద్దిపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఆత్మ గౌరవభవనాలు ఉన్న ఎకైక నియోజకవర్గం సిద్దిపేట ఒక్కటేనన్నారు. మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
ముదిరాజ్‌లు కృష్ణస్వామి మార్గంలో ఐక్యం గా ముందుకుసాగాలని, మరింత స్ఫూ ర్తితో ముందడుగు వేయాలన్నారు. చౌరస్తాను కృష్ణ స్వామి జంక్షన్‌గా పిలువనున్నట్లు ఆయ న ప్రకటించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కనుకరా జు, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, నాయకులు జంగింటి శ్రీనివాస్, ప్రశాంత్, సిద్ధరబోయిన శ్రీనివాస్, జిల్లేల సుధాకర్, ధర్మా,కీసర పాప య్య, కోనయగారి సంతోష్, కోనయగారి ఎల్లయ్య, రెడ్డి యాదగిరి, వెంకటేశం, రామకృష్ణ, ముదిరాజ్ సమాజం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.