నంగునూరు, ఆగస్టు 18 : కులం, మతం జాతి లేకుండా సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నంగునూరులో ఆదివారం పాపన్నగౌడ్ వి గ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గౌడసంఘం నేతలు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
-సిద్దిపేట జిల్లానెట్వర్క్, ఆగస్టు 18