నర్సాపూర్, ఆగస్టు 28: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆమె వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ తదితరులు ఉన్నారు.