వెల్దుర్తి, ఆగస్టు 19: వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరి ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హల్దీ ప్రాజెక్టును మంగళవారం ఆమె సందర్శించారు. ప్రాజెక్టు వద్ద ఉన్న శివాలయంలో, ప్రాజెక్టు వద్ద నీటికి, వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ బ్రిడ్జి హల్ద్దీవాగు వద్ద గంగమ్మకు నాయకులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా హల్దీవాగు నీటి ప్రవాహం, వస్తున్న నీరు, కిందకు ప్రవహిస్తున్న నీటి వివరాలను, ప్రాజెక్టు వద్ద చేపట్టిన రక్షణ చర్యలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హల్దీ ప్రాజెక్టు పొంగిపొర్లడం సంతోషంగా ఉందని, గతంలో మంత్రి గా ఉన్న సమయంలో కాలువలను తవ్వించామని, ప్రస్తుతం అవి పూడికతో నిండి ఉన్నాయని, వాటి పునరుద్ధ్దరణకు కృషి చేస్తానన్నారు.
శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు ఉండవద్దని, ఏవేని ఇబ్బందులు వస్తే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎమ్మెల్యే వెం ట తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీవో విఘ్నేశ్వర్, బీఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, పవన్, సంతో ష్, బాలేష్, యాదగిరి, శంకర్‌లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.