నర్సాపూర్, ఆగస్ట్ 15: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో దివంగత మాజీ జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 25వ వర్ధంతిని శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మారెడ్డి విగ్రహానికి ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు.
నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, లక్ష్మారెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వాకిటి లక్ష్మారెడ్డి పేదల సంక్షేమానికి కృషిచేశారని, వారికోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తుచేశారు. లక్ష్మారెడ్డిపై అభిమానంతో అశేష సంఖ్యలో తరలివచ్చి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యా వికాస్ అవార్డులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీకోఆప్షన్ మెంబర్ మన్సూ ర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ యువజన నాయకుడు సంతోష్‌రెడ్డి, ప్రముఖ వైద్యుడు రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు గోపి, సూరారం నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వర్, నాగరాజుగౌడ్, రాకేశ్‌గౌడ్, రాజేశ్, మాజీ వైస్‌ఎంపీపీ నర్సింగరావు పాల్గొన్నారు.