నర్సాపూర్/ శివ్వంపేట, జనవరి 21: నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్‌లో సర్పంచ్ మహమ్మద్ ఇస్రత్ ఫాతిమా అబూబాయ్ ఆధ్వర్యంలో హజ్రత్ సయ్యద్‌లాల్ షక్వద్రి ఉర్ఫ్ మౌలానా బాబాదర్గా వద్ద ఆదివారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇంటి వద్ద నుంచి ఎమ్మెల్యే సునీతారెడ్డి పూలు, పండ్ల దట్టీతో దర్గా వద్దకు చేరుకుని ముస్లిం మత ఆచారం ప్రకారం ప్రార్థనలు నిర్వహించారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ కులాలకతీతంగా ప్రతిఒక్కరూ దర్గాను దర్శించుకొని ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఫాతిమా అబూబాయ్ వారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, పంబల్ల భిక్షపతి, మహ్మద్ భోగచంద్రశేఖర్, బాబాబాయ్, ఆజంబాయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తాన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. విజేత సుబ్బు జీఎస్ఎమ్ టీమ్‌కు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.