నర్సాపూర్,అక్టోబర్ 27 : ప్రొటోకాల్ ఉల్లంఘనను శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మెదక్‌కు వంద సీట్లతో మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. దానిని 50 సీట్లకు కుదించి 24న మెడికల్ కళాశాలను మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసి జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి మహిళ ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించక అగౌరపరిచారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ లేనివాళ్లను అధికారులు అధికారిక కార్యక్రమాల్లో వేదికల పైకి ఎలా పిలుస్తారని ఆమె మండిపడ్డారు. ఇటీవల హత్నూర మం డ లం దౌల్తాబాద్ ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభోత్సవంలో కూడా ప్రొటోకాల్ ఉల్లంఘించారని, ప్రొ టోకాల్ ఉల్లంఘన అనేది పరిపాటిగా మారిందని ఆమె అసహనం వ్యక్తం చేశారు.