వెల్దుర్తి/కొల్చారం/నర్సాపూర్, ఆగస్టు 26: వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వచ్చే డబ్బు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి, కొల్చారం మండలాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఉమ్మడి వెల్దుర్తి మండలంలో 47, కొల్చారం మండలంలో 58 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిది నెలల కాలంలో చాలా తక్కువగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్‌కు కూడా పంచాయతీల్లో నిధులు లేవని, కొత్త ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా, పంచాయతీ పాలనను పట్టించుకోవడం లేదన్నారు. డీపీవోతో మాట్లాడి బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందును పిచికారీ చేయించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నర్సాపూర్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరుచేయలేదన్నారు. ఎస్డీఎఫ్, ఆర్అండ్బీ, ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి విడుదలైన నిధులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. 24 పనులకు (బీటీ రోడ్లకు) రూ.46.35 కోట్ల నిధులను విడుదల చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు రాజేశ్, రింగుల ప్రసాద్, మాణయ్య పాల్గొన్నారు.
పలు గ్రామాల రోడ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో వెల్దుర్తి, మాసాయిపేట మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మన్సూర్, అశోక్‌గౌడ్, రమేష్‌చందర్, ఖాజా, శాఖారం శ్రీను, శేఖర్, శ్రవణ్ పాల్గొన్నారు.
కొల్చారంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ నాయకుడు చౌరిగారి నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె స్థానిక బాబా ఫంక్షన్ హాల్లో పార్టీ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. మండలానికి చెందిన 58 మంది లబ్ధిదారులకు బిఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కు లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోష్, మాజీ ఎంపీపీ మంజూలా కాశీనాథ్, జిల్లా నాయకులు సంతోష్ కుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, మాజీ జడ్పీటీసి శ్రీనివాస్ రెడ్డి, అరిగె రమేశ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, కరెంటు రాజాగౌడ్, సొసైటీ చైర్మన్ మనోహర్ పాల్గొన్నారు.
తూప్రాన్, ఆగస్టు 26: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు వెంకటాయపల్లి బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ హరీశ్‌గౌడ్ అందజేశారు. వెంకటాయపల్లికి చెందిన జంగం రాజు, కొంతం రవి అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందారు.మంజూరైన చెక్కులను సోమవారం బాధితులకు అందజేశారు. వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, స్వామిగౌడ్, వెంకట్‌గౌడ్, పెంటాగౌడ్, రాజుగౌడ్, శ్రీనివాస్, మహేశ్‌యాదవ్, కె.శ్రీనివాస్, వెంకటేశ్, పాల్గొన్నారు.