చేర్యాల, సెప్టెంబర్ 12: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ గూండాలతో కలిసి చేసిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రాష్ట్ర రాజధానిలో వాహనాలతో ర్యాలీగా వెళ్లి దాడులు చేయడం ఏమిటని, బహిరంగంగా కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్తున్నానని చెప్పి మరి వెళ్లి దాడులకు పాల్పడిన అరికెపూడితోపాటు ఆయన కార్యకర్తలు, అనుచరులపై చర్య లు తీసుకోవాలని పల్లా డిమాండ్ చేశారు. పోలీసులు ఎమ్మెల్యే ర్యా లీని ముందుగా ఎందుకు నిలువరించకపోవడం, పాడి కౌశిక్‌రెడ్డిని మాత్రం హౌస్ అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉన్నదన్నారు. ప్లాన్ ప్రకారమే కౌశిక్‌రెడ్డిపై దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అరికెపూడి వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని హితవు పలికారు.