చేర్యాల, నవంబర్ 17: కనక దుర్గామాత ఆశీస్సులతో చేర్యాల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కనకాదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలకు ఆదివారం ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ.. పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషచేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ప్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్,మాజీ ఎంపీపీలు మేడిశెట్టి శ్రీధర్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, మాజీ వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, ఏఎంసీ వైస్ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, టౌన్, మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, మంద యాదగిరి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలు, గదరాజు చందు, నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, పచ్చిమడ్ల సిద్దిరాములు, యాట యాదగిరి, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల మానస, ఉట్కూరి అమర్‌గౌడ్, మంచాల కొండయ్య, కనకయ్య, ఎర్రోల్ల యాదగిరి, రాజేశ్‌గౌడ్ పాల్గొన్నారు.