చేర్యాల, జూన్ 20 : అమెరికాలోని వివిధ యూనివర్సిటీలను జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో పర్ధ్యు యూనివర్సిటీ ప్రతినిధులతో అనురాగ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవల్లో ఇంజినీరింగ్ ప్రాజెక్టుల శిక్షణ రంగంలో పర్ఢ్యు యూనివర్సిటీ,
అనురాగ్ యూనివర్సిటీలు పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎమ్మెల్యే పల్లా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కార్యక్రమంలో పర్ధ్యు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఓక్ విలియమ్స్, ప్రొఫెసర్ మార్టినెజ్, అనురాగ్ యూనివర్సిటీ సీఈ వో నీలిమ, డైరెక్టర్(స్ట్రాటజీ) అనురాగ్ పల్లా పాల్గొన్నారు. అనంతరం ఇంజినీరింగ్ రీసెర్చ్‌లో ప్రతిష్టాత్మక ప్రదేమైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ హాల్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను అనురాగ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు సందర్శించారు.