చేర్యాల, నవంబర్ 19 : ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాసేవలో బీఆర్ఎస్ నేతల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రజాసేవలో ఉన్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుక గార్డెన్స్‌లో బుధవారం చేర్యాలటౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలకు చెందిన 74 మందికి రూ.16.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.అధికారం ఉంటే పొంగిపోయి, ప్రతిపక్షంలో ఉంటే కుంగిపోయే వారు బీఆర్ఎస్ సైనికులు కాదన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తన సొంత దవాఖాన నీలిమాలో నిత్యం 500 మందికి ఉచితంగా వైద్యసేలు అందిస్తున్నట్లు తెలిపారు. చేర్యాలలో దవాఖానను వెంటనే ప్రారంభించాలని ఇటీవల అధికారులను కలిసి కోరినట్లు తెలిపారు.కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కొమురవెల్లి పీహెచ్‌సీని బలోపేతం చేయాలని, వైద్యులు, సిబ్బందిని నియమించి మందులు ఉంచాలని ఇటీవల మంత్రి సమీక్షలో తాను కోరినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనంతుల మల్లేశం, మేక సంతోష్, మంద యాదగిరి, గీస భిక్షపతి, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, ముస్త్యాల బాల్‌నర్సయ్య, పుర్మ వెంకట్‌రెడ్డి, మేడిశెట్టి శ్రీధర్, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిష న్, మాజీ జడ్పీటీసీ చిలువేరు సిద్దప్ప,జింకల పర్వతాలు, గదరాజు చందు, పెడుతల ఎల్లారెడ్డి, మంగోలు చంటి, జంగిటి కమలాకర్, శివగారి అంజయ్య, బూరగోని తిరుపతి,పచ్చిమడ్ల మా సన, మీస పార్వతి, తాండ్ర నవీన్‌రెడ్డి, ఆకుల రాజేష్, బంగారిగళ్ల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.