చేర్యాల, జనవరి 11: “చేర్యాల ప్రాంత ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కానుకగా ఇచ్చారు…గుండెల్లో పెట్టుకున్నారు… గుర్తుండేలా పనిచేస్తా” అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో కృతజ్ఞత సభ పార్టీ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, గీస భిక్షపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని కొండత అండగా కేసీఆర్ సారు ఉన్నారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే చెప్పిన తేదీలను మర్చిపోయారని హెద్దేవ చేశారు. డేట్లు చెప్పారు హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నీలిమా దవాఖానలో నియోజకవర్గ ప్రజలకు పార్టీలకతీతంగా ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజవకర్గ ప్రజలు రేషన్‌కార్డు తీసుకువెళ్లి చక్కగా వైద్యం చేయించుకోవచ్చని, ఇప్పటి వరకు 1084 మందికి రూ.98లక్షల విలువైన వైద్యం, మందులు తదితర సేవలు అందించినట్లు తెలిపారు.త్వరలో రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లు సాధించేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎంపీపీలు కరుణాకర్, కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాల్‌నర్సయ్య, ఏకానందం, రంజితాకృష్ణమూర్తి పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), జనగామ11: జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మద్దూరులోని తాజ్‌మహల్ గార్డెన్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంతోష్‌కుమార్, యాదగిరి అధ్యక్షతన మద్దూరు, ధూళిమిట్ట మండలాల కార్యకర్తల కృతజ్ఞత సమావేశానికి ఆయన ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు. ఎంపీపీ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లేశం, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరీఫ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, వరలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు చంద్రయ్య, వెంకట్రమణారెడ్డి, రాజమల్లయ్య, ఐలయ్య, సర్పంచ్‌లు సుదర్శన్, రవీందర్‌రెడ్డి, కనకయ్య, దీపిక, భాగ్యలక్ష్మి, రాజమ్మ, ఎంపీటీసీలు కనకమ్మ, సమ్మయ్య, నర్సింహులు, సత్యకళ పాల్గొన్నారు.