తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన మూడో శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పదేండ్ల కాలం (రెండుసార్లు) మెదక్ ఎంపీగా కొనసాగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు వీరు దుబ్బాక, జనగామ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
దుబ్బాక/చేర్యాల, డిసెంబర్ 14 : రాష్ట్రంలో మూడో శాసనసభ కొలువుదీరింది. అసెంబ్లీలో గురువారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. దుబ్బాక, జనగామ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో తొలిసారిగా దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, రెండుసార్లు మెదక్ ఎంపీగా కొనసాగారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకు దుబ్బాక శాసనసభ నుంచి పోటీ చేసి, భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యేగా ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. ముందుగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇందుకు ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒకేరోజు ప్రమాణస్వీకారం చేయడం దుబ్బాక నియెజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక ముద్దుబిడ్డగా రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా విస్తృత సేవలందించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కానున్నారు. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంపై బీఆర్ఎస్ శ్రేణు లు, అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. జనగామ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను కుల మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరికీ న్యాయం చేకూరుస్తానని మనస్ఫూర్తిగా వాగ్ధ్దానం చేశారు. జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.