రామాయంపేట, సెప్టెంబర్ 12: దేశంలోనే ఎక్కడాలేని సుపరిపాలన కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ రాజర్షి షా, ఉమ్మ డి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షణ అధికారి జోగారెడ్డితో కలిసి రామాయంపేట పట్టణంలోని పంచాయతీరాజ్ సబ్‌డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలతో కాలం గడిపారని విమర్శించారు.70 ఏండ్ల్ల పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. తొమ్మిదేండ్లలోనే రాష్ట్రంలో ప్రజలకు సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తానని ఇచ్చిన ప్రకారం సీఎం కేసీఆర్ కన్నతండ్రిలా నా చిరకాల కోరికను నెరవేర్చారన్నారు. అందుకు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. పట్టణ అభివృద్ధికి గతంలోనే మంత్రి కేటీఆర్ టీయూఎఫ్ఐడీసీ ద్వారా రెండు విడుతలగా రూ.29కోట్లు కేటాయించారని, ఇటీవల మెదక్ వచ్చిన సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధికి మరో రూ.25కోట్ల నిధులను కేటాయించారని చెప్పారు.రామాయంపేట పట్టణాభివృద్ధ్దికి మొ త్తం రూ.54కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పట్టణంలో మున్సిపల్ చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లు కలిసి అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు.
సీఎం, మంత్రి, ఎమ్మెల్యే కృషితో రెవెన్యూ డివిజన్
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం రామాయంపేటలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సీఎం కేసీఆర్ మెదక్ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు సేవ చేయడం కోసం నాతోపాటు అధి కారులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కొత్త మండలాలు, పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కొత్త మండలాలు, పంచాయతీలతో ప్రజలకు మెరుగైన సేవలతోపాటు ప్రభుత్వ పథకాలు నేరుగా చేరుతాయన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా పీఆర్ ఎస్సీ జోగారెడ్డి, ఈఈ సత్యనారాయణ, డీఈ పాండురంగారెడ్డి, ఏఈ విజయ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, రామాయంపేట, నిజాంపేట ఎంపీపీలు నార్సింపేట భిక్షపతి, దేశెట్టి పిద్దిరాములు, జడ్పీటీసీ సంధ్య, పురపాలిక వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మండల పార్టీల అధ్యక్షులు భండారి మహేందర్‌రెడ్డి, పరుపాటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, నిజాంపేట మండల రైతుబంధు అధ్యక్షుడు బిజ్జ సంపత్ కుమార్, రామాయంపేట, నిజాంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు బాదె చంద్రం, అందె కొండల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పుట్టి యాదగిరి, రామాయంపేట ఎంపీడీవో ఉమాదేవి, తాసీల్దార్ రజినీకుమారి, దేవస్థాన కమిటీ చైర్మన్ మహేష్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, సుందర్‌సింగ్, కోఆప్షన్ సభ్యు లు ఎస్కే హైమద్, పాతూరి ప్రభావతి, బాలుగౌడ్, కౌసర్ బేగం, ఎండీ గౌస్, డైరెక్టర్లు మర్కు దత్తు, చింతల రాములు, రాజుయాదవ్, చలిమెట్టి నాగరాజు, నాయకులు సంగు స్వామి, దుబ్బరాజుగౌడ్, నర్సింహులు, శ్యాంసుందర్, దేవుని రాజు, మల్యాల కిషన్ ఉన్నారు.