మెదక్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుండడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వ ర పరిష్కారం కోసం ప్రతినెల 2, 16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. మెదక్ పట్టణం 13వ వార్డులో వైకుంఠధామానికి స్థలం కేటాయించాలని స్థానిక కౌన్సిలర్ సులోచన ఎమ్మెల్యేను కోరారు. స్థలం విషయం పరిశీలించాలని మెదక్ తహసీల్దార్‌కు సూచించారు. మెదక్ పట్టణంలో అన్ని వార్డులకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు వివరించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘మీకోసం’ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ జానకీరాంసాగర్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మెదక్ నియోజకవర్గంలోని మెదక్, హవేళీఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట మండలాల్లోని గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.4.15కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సీసీ రోడ్ల కు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ మండలం రాయన్‌పల్లి గ్రామానికి రూ.10 లక్షలు, హవేళీఘనపూర్ మండలంలోని బొగడ భూపతిపూర్, ఫరీద్ పూర్, గంగాపూర్, కొత్తపల్లి, మద్దుల్వాయి, ముత్తాయికోట, ముత్తాయిపల్లి, నాగపూర్, పోచమ్మరాల్, వాడి గ్రామాలకు రూ.10లక్షల చొప్పున మంజూరయ్యాయి. పాపన్నపేట మండలంలోని ఆరేపల్లి, చిత్రియాల్, కొంపల్లి, కొత్తపల్లి, కుర్తివాడ, మల్లంపేట్, పొడ్చన్‌పల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొ ప్పున రూ.70 లక్షలు మంజూరయ్యాయి. రామాయంపేట మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. చిన్నశంకరంపేట మండలంలోని ధర్పల్లి రూ.15 లక్షలు, చందాపూర్, గవ్వలపల్లి, జంగారాయి, మల్లుపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాలకు రూ.10 లక్షలు చొప్పున రూ. 50 లక్షలు, చిన్నశంకరంపేట, టి.మాదాపూర్ గ్రామాలకు రూ.20లక్షలు చొప్పున రూ.40 లక్షలు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి రూ.50 లక్షలు, నిజాంపేటకు రూ.60 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలి పారు. క్యాంపు కార్యాలయంలో హవేళీఘనపూర్ మండలానికి చెందిన 105మంది, మెదక్ పట్టణానికి చెందిన ఆరుగురు మొత్తం 111 లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. కార్యక్రమంలో మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, బీఆర్ఎస్ హవేళీఘనపూర్ మండలా ధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, తహ సీల్దార్ నవీన్‌కుమార్, కౌన్సిలర్ కిశోర్, కోఆప్షన్ సభ్యుడు ఉమర్ మొయినొద్దీన్, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, చెన్నాగౌడ్, లక్ష్మీనారాయణ, లింగం, నాయకులు ఆశోక్, శ్రీధర్‌యాదవ్, కృష్ణాగౌడ్, ప్రభురెడ్డి, కొంపల్లి సుభాష్‌రెడ్డి, నోముల శ్రీకాంత్, సతీశ్‌రావు, సాయిలు, సాయాగౌడ్, వెం కట్, రాజేశ్వరరావు, శ్రీనివాస్, రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్న ఆర్పీలకు వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పీలు బుచ్చమ్మ, మాధవి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల భార్యలను యథావిధిగా కొనసాగించాలని, వేతనాలు రూ.18వేల వరకు పెంచాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. డ్రెస్ కోడ్, ఐడీ కార్జులు మంజూరు చేసి, ఆర్పీలకు ఆరోగ్య బీమా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేను కలి సినవారిలో ఆర్పీలు స్వప్న, యాదమ్మ, జ్యోతి ఉన్నారు.