భారీ వర్షాలు కురుస్తున్నందున ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు ప్రజలకు సూచించారు. ఎవరూ అధైర్యపడొద్దని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో అధికారులతో కలిసి పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. మెదక్ మండలంలోని తిమ్మానగర్ వద్ద కొంటూరు నుంచి ఖాజాపూర్ వెళ్లే దారిలో ధ్వంసమైన రోడ్డు, కల్వర్టును ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించి, కొత్త కల్వర్టు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శివ్వంపేట మండలం దొంతి, సీతారాంతండాల్లో ఇండ్లు దెబ్బతిన్న బాధితులను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరామర్శించి త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం 20 మంది బాధితులకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుప్పట్లను అందజేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పట్టణంలో వివిధ వార్డుల్లో తిరిగి వ్యాపారులు, స్థానికులకు జాగ్రత్తలపై సూచనలు చేశారు.
-మెదక్/ సంగారెడ్డి న్యూస్‌నెట్‌వర్క్, జూలై 28
రామాయంపేట, జూలై 28 : జిల్లాలో భారీవానలు పడుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందొద్దని, అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం రామాయంపేటలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం రామాయంపేట లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పదిరోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయని, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 155 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలి పారు. బాధితులకు గృహలక్ష్మి పథకంలో రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మండలాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు సర్వే చేపడుతున్నారని తెలిపారు.
రామాయంపేట మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులకు త్వరలోనే టెండర్ల్లు పిలుస్తామన్నారు. తూములు, అలుగులు, కట్టలు తెగిపోతే ప్రత్యేక నిధులు కేటాయించి, మరమ్మతులు చేయించి, పునరుద్ధ్దరిస్తామన్నారు. రామాయంపేట పట్టణంలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులను త్వరలో చేపడుతామన్నారు. మెదక్‌లో ప్రమాదానికి గురైన మహిళను హైదరాబాద్‌కు వెల్నెస్ సెంటర్‌కు తరలించామని, మెరుగైన చికిత్స చేయిస్తున్న ట్లు వివరించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా సంబంధిత అధికారుల దృష్టికి ప్రజలు తీసుకురావాలని సూచించా రు. చెరువు, కుంటల వద్దకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, నిర్లక్ష్యంగా వెళ్లొద్దన్నారు.
విద్యుత్ సంబధిత సమస్యలను అధికారులకు వివరించి, మరమ్మతులు చేసుకోవాలన్నారు. మెదక్ – ఎల్కతుర్తి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా నిర్మించాలని సంబంధిత ఆర్అండ్బీ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, కౌ న్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, కో ఆప్షన్ సభ్యు లు ఎస్కే హైమద్, బాలుగౌడ్, అస్నొద్దీన్, బీఆర్ఎస్ నేతలు ఐలయ్య, దేవుని రాజు, మల్లేశం, డైరెక్టర్లు రాజూయాదవ్, మర్కు దత్తు, చింతల రాములు తదితరులు ఉన్నారు.