మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), డిసెంబర్ 29 : భక్తుల కొంగు బంగారం బండ మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారుల్లోని బండ మల్లన్న గుట్టపై సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వామి వారికి నిర్వహించే పూజల్లో ఆదివారం ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బండ మల్లన్న ఆలయ అభివృద్ధి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సం క్రాంతి పండుగ నాడు జరిగే జాతరను ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లింగాల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, మాజీ ఎంపీపీ పంజాల కవితా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్లు బాలకృష్ణ, యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరారెడ్డిపల్లిలో ఇటీవల గోల్కొండ పాఠశాలకు చెందిన రెండు వాహనాలను దుండగులు నిప్పు పెట్టి దహనం చేశారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపాల్ రవిని పరామర్శించారు. దహనం చేసిన వాహనాలను పరిశీలించి విచారం వ్యక్తం చేశారు.