అభివృద్ధికి శాయశక్తులా కృషి
సిద్దిపేట జిల్లా దుబ్బాక ని యోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి చేనేత సొసైటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఆనంతరం పట్టణంలో కోర్టు భవనానికి దుంపలపల్లి రోడ్డులో స్థలాన్ని పరిశీలించారు.
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, జూలై 9: సిద్దిపేట జిల్లా దుబ్బాక ని యోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి చేనేత సొసైటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఆనంతరం పట్టణంలో కోర్టు భవనానికి దుంపలపల్లి రోడ్డులో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నామన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడులో దుబ్బాక నియోజకవర్గానికి పెద్దపీట వేసినట్లు గుర్తుచేశారు.
దుబ్బాకకు యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరయ్యిందన్నారు. చేనేత సహకార ఎన్నికల్లో దుబ్బాక చేనేతలు ఐక్యత చాటుకున్నారని ఎమ్మెల్యే అభినందించారు. సొసైటీ చైర్మన్ అంకం మధు, ఆయన పాలకవర్గాన్ని అభినందించా రు. దుబ్బాక చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. వానకాలంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నీటి ట్యాంకులు శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, మురుగు కాల్వలలో చెత్తా చెదారం,పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని సూచించారు.
యూరియా కొరత లేకుండా చర్యలు
దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మండలాల్లో ఆగ్రోస్, ఇతర ఎరువుల దుకాణాల్లో యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

