తొగుట : మండలంలోని కాన్గల్కు చెందిన బాసిరెడ్డి గారి అనసూయమ్మ( Anasuyamma) మరణం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotta Prabhakr Reddy ) విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి కాన్గల్లో అనసూయమ్మ భౌతిక కాయనికి నివాళి ( Tribute ) అర్పించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె కుటుం సభ్యులు బాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్లు కే హరికృష్ణ రెడ్డి, శేర్ల కైలాసం, నాయకులు బాణపురం కృష్ణారెడ్డి, కడతల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, నామిలే భాస్కరా చారి, సుక్కురి లింగం, తౌడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.