దుబ్బాక, ఏప్రిల్ 11: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి అని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. హైదరాబాద్‌లో శనివారం ఇంటి నుంచి ఓ కార్యక్రమానికి వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యేను అక్కడి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే దుబ్బాక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరుచూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్ట్‌లు లేదా హౌస్ అరెస్ట్‌లు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కారణాలు లేకుండా ప్రజాప్రతినిధులను అడ్డుకుని, అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శంచారు.