గజ్వేల్, సెప్టెంబర్ 17: తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమా లు, పోరాటాలు చేయడంతోనే నేడు ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని, రాష్ట్రం రాకపోతే తెలంగాణకు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడా, కేసీఆర్ పెట్టిన భిక్షతోనే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాడని, కాంగ్రెస్‌లో గాంధీలుపోయి గాడ్సెలొచ్చారని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారంతో పోతే పాతాళంలోకి పోవడం ఖాయమన్నారు. అభినవ వల్లభాయ్ పటేల్లా కేసీఆర్ తెలంగాణ సాధిస్తే ఆయన మీద సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా నాలుక పారేసుకోవడం మంచిది కాదన్నారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడే విధానం చూస్తే తులసివనంలో గంజాయి మొక్కలా ఉందన్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని, అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహం తలిగింపు ఖాయమన్నారు. నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి నేడు బలిదేవత భర్త విగ్రహాన్ని ఎలా పెడుతున్నడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తూ ప్రభు త్వం వాటిని పక్కన పెట్టి పేద ప్రజల కోసం పని చేయాలన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. గ్రామ పంచాయతీల్లో నిధు లు లేక పారిశుధ్యం పడకేసిందని, దవాఖానల్లో మందుల కొరత ఏర్పడిందన్నారు. ప్రజలు ఛీకొడుతున్నా ప్రభుత్వం మాత్రం మేల్కొనడం లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, రాష్ట్ర నాయకుడు దేవీరవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్, మాజీ జడ్పీటీసీలు మల్లేశం, అర్జన్గౌడ్, కౌన్సిల ర్లు గోపాల్‌రెడ్డి, రజిత, బాలమణి, రహీం, కనకయ్య, నాయకులు యాదవరెడ్డి, నర్సింగరావు, ఉమార్ తదిత రులు పాల్గొన్నారు.