కోహీర్, మే11: దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కోహీర్ పట్టణంలోని రైల్వే గేటు నుంచి పాత బస్తాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒకటేనన్నారు. అందుకే ఎమ్మెల్సీ కవితను జైలులో పెట్టించారన్నారు. తెలంగాణ ఉద్యమకారుడైన బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. రోడ్ షోకు వేలాది మంది తరలిరావాడం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు నాంది అన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎంపీగా గెలిపించండి.. యువతకు ఉపాధి కల్పిస్తాను.. జహీరాబాద్ అభివృద్ధికి నిమ్జ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు.
అన్ని మండల కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించి, యువతకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని, తన విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కర్త దేవీప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ స్రవంతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికార్, మాజీ సర్పంచ్‌లు రాజశేఖర్, నర్సింహులు, ఖీజర్ యాఫై, కలీం, సావూద్, గణేశ్‌రెడ్డి, ఆనంద్, మొల్ల య్య, సందీప్ పాల్గొన్నారు.