shri guru peetham | శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గురు పీఠంలోని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం రెండవ రోజు శ్రీ గురు పీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్, వేద పండితులు శాస్త్రుల వామన శర్మ ఆధ్వర్యంలోబుధవారం కనుల పండుగ జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ గురు పీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్, వేద పండితులు వామన శర్మలు దేవాలయాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్య అతిథులు దేవాలయంలోని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, షిరిడి సాయిబాబా విగ్రహాలను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ శ్రీ గురు పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కండువాలు వేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జెడ్పిటిసి పబ్బ మహేశ్ గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణ గౌడ్, జడ్పికో ఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు యాదవ్ గౌడ్, మర్రి మహేందర్ రెడ్డి, కృష్ణారావు, సంతోష్ రెడ్డి, పవన్ గుప్తా, బిక్షపతి రెడ్డి, నరసింహారెడ్డి, రాజ్యం బిక్షపతి యాదవ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు