నంగునూరు, నవంబర్ 3: సిద్దిపేట నియోజకవర్గం లోని నంగునూరు మండలం ఘనపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్ పనులను మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే యాసంగికి ఎట్టి పరిస్థితిల్లో నీళ్లు అందించాలని అధికారులకు సూచించారు.
పదకొండున్నర కిలోమీటర్ల కెనాల్‌కు ఏడున్నర కిలోమీటర్లు పూర్తయిందని, మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ పంప్‌హౌస్ పూర్తి చేసి కెనాల్ ద్వారా ఘనపూర్‌లో 4 చెరువులు, అకెనపల్లిలో 4 చెరువులు, గట్లమల్యాలలో 5 చెరువులు, మొత్తం 13 చెరువుల్లో ఈ యాసంగికి నీళ్లు నింపాలని అధికారులను కోరారు. మోటర్లు బిగించి నీళ్లు పంపింగ్ చేయాలని, విద్యుత్ పనులు పూర్తి చేయాలన్నారు. హరీశ్‌రావు వెంట మండల నాయకులు ఉన్నారు.