పటాన్చెరు టౌన్, జూన్ 14 : పెన్నార్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ అండగా ఉండి మెరుగైన వేతన ఒప్పందం అందించే బీఆర్టీయూను యూనియన్ ఎన్నికల్లో గెలిపించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పెన్నార్ ఇండస్ట్రీస్ బీఆర్టీయూ సర్వసభ్య సమావేశానికి ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా బీఆర్టీయూ యూనియన్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడంతో పాటు సీటీ సీ లేకుండా వేతన ఒప్పందం, పెండింగ్ సమస్యలు పరిష్యరించడం, మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు, ఫెస్టివల్ అడ్వాన్స్, ఎడ్యుకేషనల్ లోన్, మహిళా కార్మికుల కోసం సెలవులు, అటెండెన్స్ బోనస్ పెంచినట్లు తెలిపారు. ఈనెల 20న జరిగే పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపై ఓటేసి బీఆర్టీయూ యూనియన్ను గెలిపిస్తే అందరికీ ఆమోదయోగ్య మైన వేతన ఒప్పందం, శాశ్వత ఉద్యోగ నియామకాలను పెంచడం, న్యాయబద్ధ్దంగా యాజమాన్యం నుంచి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అందిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ కార్మికులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, యూనియన్ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి, యూనియన్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, కార్మిక సంఘం ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.