తిమ్మక్క చెరువు పటాన్‌చెరుకు తలమానికం
పటాన్చెరువుకే తలమానికంగా తిమ్మక్క చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. రూ.4.45 కోట్లతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనులను గురువారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
- రూ.4.45 కోట్లతో సుందరీకరణ పనులు
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు టౌన్, జూలై 9: పటాన్చెరువుకే తలమానికంగా తిమ్మక్క చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. రూ.4.45 కోట్లతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనులను గురువారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలను భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గం లోని చెరువును దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే పటాన్‌చెరులోని తిమ్మక్క చెరువును ఆధునికంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
చెరువు అభివృద్ధికి హెచ్ఎండీ నుంచి రూ.3.05 కోట్లు, ఏపీఆర్ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.1.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, ఓపెన్ జిమ్, స్వాగత తోరణాలు, బెంచీలు, చిన్నారులకు ఆటస్థలం, ల్యాండ్ స్కేపింగ్, హరితవనం పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రూ. 30లక్షలతో చెరువు చుట్టూ చేపట్టిన రక్షణ కంచె పూరయ్యిందన్నారు. సాకి చెరువు, తిమ్మక్క చెరువులను పటాన్‌చెరుకు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్ధుతామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, హెచ్ఎండీఏ డీఈ రామారావు, ఏపీఆర్ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, నర్రా భిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేశ్, రాజు, ధనరాజ్‌గౌడ్, భోజయ్య, షకీల్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

