గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలంలోని శివనగర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన యువజన సంఘం భవనం, రూ.15లక్షలతో నిర్మించిన రజక సంఘం, నాయీబ్రాహ్మణ సంఘం భవనాలను ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
- నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
- రూ. 20 కోట్లతో డబుల్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
- రూ. 1.76 కోట్లతో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సామాజిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
- మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ
- యువకులకు స్పోర్ట్స్ కిట్లు అందజేత
జిన్నారం, అక్టోబర్4: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలంలోని శివనగర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన యువజన సంఘం భవనం, రూ.15లక్షలతో నిర్మించిన రజక సంఘం, నాయీబ్రాహ్మణ సంఘం భవనాలను ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షే మం, అభ్యున్నతికి నిధులు కేటాయిస్తూ అవసరమైన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తునే ఉన్నామన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రా మస్తులు ఎవరు చెప్పినా సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. రోజురోజుకూ పట్టణా లు, గ్రామాలు విస్తరిస్తున్నాయని, పెరుగుతున్న జనాభకు అనుగుణంగా కాలనీలు పెరుగుతున్నాయన్నారు. అవసరమైన అన్ని మౌలిక వసతులు వెంటనే కల్పించేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజకీయాలకు స్థానం లేదన్నారు. మరోసారి బీఆర్ ఎస్‌ను గెలిపించాలని కోరారు. జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ్రప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రేఖాకృష్ణ, ఎంపీటీసీ సంతోషీమహేశ్, వివి ధ గ్రామాల సర్పంచ్‌లు ప్రకాశంచారి, చెట్టి శివరాజ్, ఆంజనేయులు, ఖదీర్, ఎంపీటీసీ స్వాతీప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పూజారిరాజు, మాజీ ఎంపీటీసీ బాశెట్టిరాజు, సార నరేందర్, నక్కనాగరాజు, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, నాయకులు చెక్క కృష్ణాగౌడ్, రామకృష్ణ, బీమ్‌రావు, మైనార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

