కార్యకర్తలే మా బలం..బలగం
బీఆర్ఎస్ కార్యకర్తలే మా బలం..బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్, పటాన్చెరు డివిజన్, మండలం సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
- వెంకట్రామిరెడ్డిని కష్టపడి గెలిపించుకుందాం
- కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో వ్యతిరేకత
- బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
- ఇరవై రోజుల కష్టంతో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
- సన్నాహక సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, ఏప్రిల్ 22: బీఆర్ఎస్ కార్యకర్తలే మా బలం..బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్, పటాన్చెరు డివిజన్, మండలం సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు కీలకం అన్నారు. తెలంగాణ హక్కులపై రాజీలేకుండా పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ప్రయోజనాలను ఇతర రాష్ర్టాలకు తాకట్టుపెడతాయన్నారు.
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో నిరుత్సాహం పెరిగిందన్నారు. బీజేపీ మతతత్వ పరిపాలనతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ మోసపూరత వాగ్ధానాలు చేసి ప్రజలను నిండా ముంచిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు తిరిగి గుర్తిస్తున్నారన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. బూత్ లెవల్ నుంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

బీఆర్ఎస్ మూడుసార్లు పటాన్చెరులో గెలిచిందని, అదంతా కార్యకర్తల కష్టమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కష్టపడిన వారిని గుర్తిస్తామన్నారు. నాయకులు ధైర్యంగా ముందుండి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.100కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కులం, మతం పేరున ఎవరు మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ అందరినీ సమానంగా చూసిందన్నారు. ప్రతి బూత్ నుంచి మెరుగైన ఫలితాలు రావాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు.
బూత్ లెవల్లో ఓటర్లను కలిసి కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వెంకట్రామిరెడ్డి వంటి ఐఏఎస్‌ను చట్టసభల్లోకి పంపిస్తే మన మెతుకు సీమ కష్టాలు వివరించి నిధులు సాధిస్తారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు పాండు, డివిజన్ అధ్యక్షుడు అఫ్జల్, మెరాజ్‌ఖాన్, గూడెం మధుసూదన్‌రెడ్డి, యాదమ్మ, మాజీ సర్పంచ్‌లు లక్ష్మయ్య, సుధీర్‌రెడ్డి, అంతిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

