సంగారెడ్డి, జూలై 14: పెండింగ్ పనులపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ (ఈఈ)ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ జల పథకం పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి పట్టణానికి రూ.44కోట్లు, సదాశివపేటకు రూ.8. 5కోట్లతో జల పథకం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరైనా ఎక్కడికక్కడే ఉన్నాయని అధికారులపై మండిపడ్డారు. పెండింగ్ పనులపై వివరాలు తెలుసుకుని పూర్తిచేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.