సదాశివపేట, సెప్టెంబర్ 29 : ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక అయ్యప్పదేవాలయంలో గురుస్వామి ఓదెల ప్రభుగుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తండ్రి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రక్తదాన శిబిరం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం ప్రాణదానంలో సమానమని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణశివరాజ్పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్, అయ్య ప్ప సేవా సమితి అధ్యక్షుడు గోనె శంకర్ గురుస్వామి, వోదెల రవీందర్గుప్తా, ఓదెల విలాస్గుప్తా, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
ఆత్మరక్షణకు కరాటే తప్పనిసరి అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విద్యార్థులకు సూ చించారు. ఆదివారం పట్టణంలోని గంజీ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-14,17 బాలబాలికలకు కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కరాటే పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మా ట్లాడుతూ కరాటేలో మంచి నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్న మాస్టర్ శంకర్గౌడ్ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, ఎన్జీఎఫ్ సెక్రటరీ అమూల్య మ్మ, కరాటే మాస్టర్ సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.