సంగారెడ్డి, అక్టోబర్ 5: విద్యార్థులను దేశం గర్వించేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 మంది ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పురస్కారాలను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆరోగ్యం బాగలేకున్నా తనను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నా రు. ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల సాధనలో న్యాయపరమైన కోరికలు, చట్టపరమైనవి ఇవ్వాల్సిందేనని, హక్కుల విషయంలో ఉపాధ్యాయుల వెంట ఉండి హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, సురేందర్, ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, విశ్రాంత ఎంఈ వో వెంకటేశం, అంజయ్య, వివిధ సంఘాల అధ్య క్ష,కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.