సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 5: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అరెస్టును సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. గురువా రం హైదరాబాద్‌లో హరీశ్‌రావును అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌తో కలిసి ఆయన హరీశ్‌రావును కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్బంధ పాలనపై మండిపడ్డారు.
రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రజాకోర్టులో శిక్షతప్పవని హెచ్చరించారు. పోలీసులు పనితీరు మార్చుకోవాలని, కాం గ్రెస్ నేతలకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిందని విమర్శించారు. సీఎం ఆదేశాలతోనే పోలీసులు తప్పులు చేస్తున్నారని, పార్టీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి శాశ్వతం కాదని, ఆయ న పతనం మొదలైందని జోస్యం చెప్పారు. వెయ్యి మంది రేవంత్‌రెడ్డిలు ఒక్కటైనా బీఆర్ఎస్ను ఏమీచేయలేరన్నారు. బీఆర్ఎస్ను ఎంత అణచివేయాలని చూస్తే అంత తిరుగుబాటు వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.