నర్సాపూర్/ శివ్వంపేట/ కొల్చారం/ చిలిపిచెడ్, మార్చి 30 : జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూ.. అండగా ఉంటానని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. 50 కిలోల కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేశారు. క్రేన్ సాయంతో భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలే బంధువులు, ఆప్తులు అని, వారికి జీవితాంతం సేవ చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం దక్కిందని, ఎమ్మెల్యే హోదాలో ప్రజల సమస్యలను పరిష్కరించడం సం తృప్తిగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానన్నారు. ముందుగా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి స్వాగతం పలికి పటాకులు కాల్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఎంపీపీ వెంకటనర్సింగరావు, బీఆర్ఎస్ నాయకుడు చిలుముల విక్రమ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్ట ణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు రమేశ్‌నాయక్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, దావూద్, రవీందర్, రాకేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
పేదల పెన్నిధి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి..
ప్రజాసంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న పేదల పెన్నిధి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అని శివ్వంపేట జడ్పీటీసీ మహేశ్‌గుప్తా అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ పద్మావెంకటేశ్, నాయ కులు లక్ష్మీనర్సయ్య, పోచాగౌడ్, కొండల్, రాజు ఉన్నారు.
ఎమ్మెల్యేకు గజమాలతో సన్మానం
కొల్చారంలో ఎమ్మెల్యే మదన్రెడ్డ్డిని గజమాలతో బీఆర్ ఎస్ శ్రేణులు సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు గౌరీశంకర్గుప్త్తా, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ సావిత్రిరెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు కోనాపూర్ సంతోశ్‌రావు, సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ముత్యంగారి సంతోష్‌రావు పాల్గొన్నారు.
చిలిపిచెడ్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వ హించారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్‌చైర్మన్ రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వై మాజీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సుభాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, సర్పంచ్‌లు గోపాల్‌రెడ్డి, మాంతప్ప, బుజ్జిబాయి, యాదగిరి, భిక్షపతి, శంకర్‌నాయక్, నాయకులు మాణిక్యరెడ్డి, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, షఫీ, ముకుందరెడ్డి పాల్గొన్నారు.