నర్సాపూర్, ఏప్రిల్ 17 : నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్‌లోని సాయికృష్ణ గార్డెన్లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి నర్సాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
అదేవిధంగా రంజాన్ పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ బాబ్యానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భోగశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగ్‌రావు, నాయకులు ఆంజనేయులు గౌడ్, శివకుమార్ తదితరులు ఉన్నారు.