నారాయణఖేడ్, జనవరి 7: నారాయణఖేడ్ నియోజకవర్గంతో పాటు అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో మొత్తం 1.65లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రతిష్టాత్మకమైన బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మె ల్యే మహారెడ్డి భూ పాల్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథ కం పనుల విషయమై సీఎం కేసీఆర్ దృష్టి కి తేగా వెంటనే స్పందించిన సీఎం కలెక్టర్ శరత్‌తో పాటు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారు లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుకు ఫోన్ చేసి పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నారాయణఖేడ్ ని యోజకవర్గంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరగా అప్పటికప్పుడు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి ని యోజకవర్గంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయిలో మెరుగుప ర్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు.
బీదర్‌లో బీఆర్ఎస్ విస్తరణ భేష్
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బీఆర్ఎస్ విస్తరించేందుకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేస్తున్న కృ షిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఇటీవల చిల్లర్గి బీజేపీ నాయకులు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా మరోవైపు ఎమ్మెల్యే బీదర్‌లోని పలువురు ప్ర ముఖులను కలిసి బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించిన విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించిన ట్లు ఎమ్మెల్యే చెప్పారు. బీఆర్ఎస్ను బీదర్ జిల్లాతో పాటు కర్ణాటకలో బలోపేతం చేసే దిశ గా కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించిన ట్లు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు.