గజ్వేల్ ప్రజలు నియత్ గల్లోళ్లు అని, సీఎం కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం గజ్వేల్‌లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ గజ్వేల్‌కు రావడం ప్రజలందరి అదృష్టమని, కేసీఆర్ రాక ముందు గజ్వేల్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని అందరూ ఒకసారి గుర్తుతెచ్చుకోవాలన్నారు. ఈసారి గెలిస్తే నెలకు ఒకసారి గజ్వేల్ ప్రజలతో గడుపుతానని కేసీఆర్ మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్నాయని గజ్వేల్‌కు చాలామంది వచ్చి ఏదేదో మాట్లాడుతూ, మనల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. నవంబర్ 30 తరువాత వారెవరూ ఇక్కడ కనిపించరన్నారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ ఇతర ప్రాంత నేతలకు ఎందుకు ఉంటదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తిరిగి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేసి సీఎం కేసీఆర్‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. సద్దితిన్నరేవును తలవాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
గజ్వేల్, అక్టోబర్ 26: గజ్వేల్ ప్రజలు నియత్ గల్లోళ్లని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌లో గురువారం నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గజ్వేల్‌కు రావడం ప్రజలందరి అదృష్టమని, కేసీఆర్ రాక ముందు గజ్వేల్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ మొన్న చాలా గొప్ప విషయం చెప్పారని, ఇక నుంచి నెలకు ఒకసారి మీతో గడుపుతానని మాట ఇచ్చారని గుర్తుచేశారు. కోమటిబండకు ప్రధాని నరేంద్రమోదీ మిషన్ భగీరథ ప్రారంభించడానికి వచ్చారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లేనిదే ఇంత మంచి అభివృద్ధి పని అయ్యేదా అనే విషయాన్ని ఆలోచించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసి పనిచేసి మంచి మెజార్టీ సాధించాలని సూచించారు. గజ్వేల్ ఎన్నికలంటే చాలా ప్రాముఖ్యత కలవని, ఈ రోజు గజ్వేల్‌కు చాలామంది వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, మనల్ని మభ్యపెడుతారని, కానీ నవంబర్ 30 తర్వాత వారెవరూ ఇక్కడ కనిపించరన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయకుంటే మన హయాంలో కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేయలేరన్నారు. మనం అందరం ప్రజా జీవితంలే ఉన్నామని, తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పని చేసి పెట్టానని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా మీరు చెప్పిన పని చేశానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
01
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వందకు వందశాతం ఏర్పాటు కావడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. ఈ రోజు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు ఉన్నదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి లబ్ధిదారులను కలిసి కేసీఆర్‌కు ఓటు వేసేలా చూ డాలన్నారు. రైతుబంధు డబ్బులు 69లక్షల మందికి ఇస్తునానమని తెలిపారు. కరెంట్, ఎరువులు, చెరువుల మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు ఏ ఊర్లో కూడా నీళ్ల కోసం బోర్లు వేసే పరిస్థితి లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే సీఎం కేసీఆర్ ఈసారి రైతుబంధు డబ్బులను పెంచుతామని ప్రకటించారన్నారు. ఈ విషయాన్ని రైతులకు, ప్రజలకు వివరించాలన్నారు. భూమిశిస్తు, కరెంట్ బిల్లులు రైతుల వద్ద నుంచి వసూలు చేయడం లేదని తెలిపారు. సమైక్య పాలనలో 29 లక్షల పింఛన్లు మాత్రమే ఇస్తే, తాము 47లక్షల వరకు పింఛన్లు ఇస్తున్నామని, ఈసారి పింఛన్ రూ.5వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా కేసీఆర్ ఉన్నారని, రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు. ఇవన్నీ గడపగడపకూ వెళ్లి ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేసి అఖండ విజయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కట్టబెట్టాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌కు లక్ష మెజార్టీ ఇవ్వాలన్నారు. కేసీఆర్ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, సద్దితిన్నరేవును తలవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ గ్రామస్థాయిలో పనిచేస్తే బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు జోస్యం చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాదాసు శ్రీనివాస్, జహంగీర్, నాయకులు శేఖర్‌గౌడ్, కొట్టల యాదగిరి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల సమన్వయ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.