పటాన్చెరు, మే 13: వేణుగోపాలస్వామి ఆశీస్సులు సమస్త తెలంగాణ ప్రజలపై ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాగా, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, శాసన మండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. వీరికి కార్పొరేటర్ కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికి, సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమన్నారు.
ఆధ్యాత్మికతకు కృషి చేస్తున్నారంటూ కార్పొరేటర్ కుమార్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కల్వకుర్తి శాసన సభ్యుడు జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కె.సత్యనారాయణ, నందీశ్వర్‌గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు కాట శ్రీనివాస్‌గౌడ్, పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, కార్పొరేటర్ పుష్పానగేశ్, ఆదర్శ్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, గూడెం మధుసూవన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, నాయకులు అఫ్జల్ అలీ, కొలన్ బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, వంగరి అశోక్, తొంట అంజయ్య యాదవ్, దశరథరెడ్డి, బి.వెంకట్‌రెడ్డి, సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్, శ్రీధర్‌చారి, మెట్టు మదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.