హుస్నాబాద్, డిసెంబర్ 10: మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దవాఖానకు వెళ్లి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లిన ఆయన మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.