అక్కన్నపేట, ఆగస్టు 9: మెట్ట ప్రాంతానికి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు అందిస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మం డలంలోని పోతారం(జే) గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో భాగంగా ఈతమొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీడు భూముల్లో పండ్ల తోట లు, కూరగాయలు, ఇతర పంటలు పండించాలన్నారు.
ఇందుకు వ్యవసాయశాఖ, అనుబంధ రంగాల సహకారం ఉంటుందన్నారు. ఖాళీ భూముల్లో ఈత, తాటి, ఇతర మొక్క లు నాటాలని సూచించారు. కుల వృత్తులకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఆయ న ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. త్వరలోనే భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ఎన్జీటీలో ఉన్న కేసులను ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తామన్నారు.
కా ర్యక్రమంలో డీఆర్డీవో పీడీ జయదేవ్ అర్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌మూర్తి, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, డీఎల్పీవో వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సీఐ పవన్, తహసీల్దా ర్ అనంతరెడ్డి, ఎంపీడీవో జయరామ్, ఏపీ వో ప్రభాకర్, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి, సింగిల్ విం డో డైరెక్టర్ బండి కుమార్, అయిలయ్య, సం జీవరెడ్డి, జయపాల్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.