హైదరాబాద్ ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనాభా గణాంకాల కమిషనర్ జారీ చేసిన సర్యులర్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు విచారించిన హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటుతో జనాభా గణాంకాల సేకరణపై ఎలాంటి ప్రభావం ఉండదని పేరొంది.. ఈ ప్రక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.
జీహెచ్ ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11న జారీ చేసిన జీవో 55ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన దారం గురవారెడ్డి అనే వ్యాపారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుమ్మి రాజ్‌కుమార్ వాదిస్తూ, జనాభా గణాంక సేకరణ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్ల ఏర్పా టు నిర్ణయం తీసుకుందని, ఇది చట్ట వ్యతిరేకమని పేరొనాలని కోరారు. జనాభా గణాంకాల సేకరణ వ్యవహారంపై జనాభా గణాంకాల కమిషనర్ జారీ చేసిన సర్యులర్ మేరకు 2025 డిసెంబరు 31వరకు ఉన్న సరిహద్దుల వివరాలను మార్చకూడదన్నారు.
దీని ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాలు, మండలాలుచ గ్రామాలు ఏర్పాటు లేదా ఉన్న వాటిలో వేరే వాటి విలీనం చేయరాదన్నారు. అయితే, 2025 డిసెంబర్లో 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ ఎంసీలో విలీనం చేసి జీహెచ్ ఎంసీ విస్తీర్ణం పెంపు చేసిందని, ఆ తర్వాత జీహెచ్ ఎంసీని 300 వార్డులుగా విభజన చేయడం, ఆపై, జీహెచ్ ఎంసీని సైబరాబాద్, మలాజిగిరి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ల పేర్లతో మూడు కార్పొరేషన్లుగా విభజన చేసిందని వివరించారు.
ఈ మేరకు ప్రభుత్వం జీవో 55 జారీ చేసిందన్నారు. కేంద్ర జనాభా గణాంకాల కమిషనర్ 2025 జూన్‌లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2027 జనాభా గణాంకాలు 2026 ఏప్రిల్ 1 సెప్టెంబరు 30 నుంచి మొదటి విడత ప్రారంభమవుతుందన్నారు. దీనికి సంబంధించి 2010 నుంచి జూన్ 2025 వరకు సరిహద్దుల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించారన్నారు. అనంతరం 2026 జనవరి 10 నుంచి 2025 డిసెంబర్ 31వరకు జరిగిన పరిధుల మార్పునకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారన్నారు అంటే డిసెంబర్ 31 నుంచి ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్నారు.
అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రెఫరెన్స్ తేదీ మార్చి 1 నుంచి మొదలవుతుందన్నారు. జనాభా గణాంకాలు మార్చి 2027 నుంచి లెకిస్తున్నప్పుడు ఏడాదికి ముందు అంటే 2026 మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, దీనిపై మరో వారం రోజుల్లోగా రిప్లయ్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. జనాభా లెకల సేకరణ ప్రారంభమవుతోందని, ఇది మొదలైతే పిటిషన్ నిష్ఫలమవుతుందన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం విభేదించింది. జనాభా లెకల సేకరణను నిలిపివేయడానికి నిరాకరించింది.