అప్పడే మొదలైన సాగునీటి కష్టాలు
ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. అప్పుడే అన్నదాతకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నారు. ఆకేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు తెగిపోవడంతో నీరు నిల్వ ఉండక వాగు వట్టిపోతున్నది. దీంతో రైతులు పంటలను కాపాడేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
- ముదురుతున్న ఎండలు.. వట్టిపోతున్న ఆకేరువాగు
- ఎండుతున్న పంటలు.. కాపాడేందుకు అన్నదాతల కష్టాలు
- వాగులో గుంతలు తీయిస్తూ.. పొలాలకు నీరు పారిస్తున్న రైతులు
నర్సింహులపేట, ఫిబ్రవరి 19 : ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. అప్పుడే అన్నదాతకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నారు. ఆకేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు తెగిపోవడంతో నీరు నిల్వ ఉండక వాగు వట్టిపోతున్నది. దీంతో రైతులు పంటలను కాపాడేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలతో వాగులో గుంతలు తీయిస్తూ పంట పొలాలకు నీళ్లు మళ్లిస్తున్నారు.
నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల శివారుల నుంచి పారే ఆకేరు వాగు ఎండిపోయింది. ముంగిమడుగు రెవెన్యూ శివారులోని చెక్‌డ్యాం పూర్తిగా ఎండిపోవడంతో వాగును ఆసరాగా చేసుకొని వరి సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గంటకు రూ.3 వేలు ఖర్చు చేసి వాగులో జేసీబీలతో గుంతలు తవ్విస్తున్నారు. మరికొంత మంది రైతులు రూ.20 వేల వరకు ఖర్చు చేసి క్రేన్ సాయ బావుల్లో పూడిక తీస్తున్నారు. గత మూడేళ్ల నుంచి యాసంగి వచ్చిందంటే సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వరిపంట కాపాడేందుకు ఆకేరు వాగులోకి ఎస్సారెస్పీ జలాలు వదలాలని కోరుతున్నారు.
కూలికి పోయిన పైసలతో గుంత తీస్తున్నా
రెండు ఎకరాల పొలం పారించేందుకు పడరానిపాట్లు పడుతున్నా. ఇద్దరి పొత్తుల నాలుగు ఎకరాలు వరి సాగు చేసినం. వాటాల ప్రకారం పొలం పారించుకుంటున్నాం. వాగులో నీరు లేక పోవడంతో గుంత తీసేందుకు గంటకు రూ.2500 చొప్పున రూ.5000 పెట్టి తీయించాం. 9 ఏళ్లలో ఎప్పుడూ వాగు ఎండి పొలే. వరి పంటకు ఇప్పటికే రూ.25వేలు ఖర్చు చేసిన. మొదట్లోనే ఇలా ఉంటే చివరికి వచ్చే సరికి నీళ్లు లేకపోతే కష్టమే. పొత్తుల మోటర్ కావడంతో ఇద్దరం తలా రూ.2500 వేలు వేసుకొని జేసీబీతో గుంత తీయించినం. నీళ్లు రాకపోతే కష్టమే.
– అంగోతు రాజీ, మహిళా రైతు
నీటి కోసం అరిగోస పడుతున్నాం..
రెండు నెలలుగా వాగులో నీరు లేక పోవడంతో పంటలు కాపాడేందుకు అరిగోస పడుతున్నాం. నాటు వేసి 35 రోజులే అయింది. నీళ్లు లేక తిప్పలు పడుతున్నాం. గంటకు రూ.2,500 పెట్టి వాగులో గుంతలు తీయిస్తున్నా. ఇప్పడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎట్లనో.. ఇంకో 10 రోజుల వరకైనా వాగులోకి నీరు వస్తే పంట బతుకుతుంది. లేకపోతే కష్టమే.
– భూక్యా లింగన్న, బొడ్డితండా
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

