రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న మంత్రి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఆగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. అక్కడే ఉన్న మంత్రి హరీశ్‌రావుతో కొద్దిసేపు ముచ్చటించి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
మెదక్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటన ముగించుకుని మెదక్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. దీంతో మెదక్ వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. మంత్రికి జడ్పీ చైర్పర్సన్ హేమలత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌తో కలిసి ఫొటోలు దిగారు. జూకల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం పర్యటన, సభ ఏర్పాట్లపై వచ్చిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుతో కొద్దిసేపు మంత్రి కేటీఆర్ ముచ్చటించి వెళ్లిపోయారు. అంతకుముందు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మనుమడితో మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు.