నంగునూరు, డిసెంబర్ 18: తడిసిన వెంకట్‌రెడ్డి మరణంతో ఆత్మీయుడిని, మంచి నాయకున్ని కోల్పోయామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండలంలోని బద్దిపడగ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ర్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ, ప్రస్తుత జడ్పీటీసీ భర్త తడిసిన వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి గ్రామానికి వెళ్లి, వెంకట్‌రెడ్డి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమైన భార్య జడ్పీటీసీ ఉమను ఓదార్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ]
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, తనకు ఎంతో ఆత్మీయుడని, ఎప్పుడూ వెంకన్న అని ప్రేమతో పిలిచేవాడినని తెలిపారు. వెంకట్‌రెడ్డితో తన అనుబంధాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ పదవులు చేపట్టి, గ్రామ, మండల అభివృద్ధికి కృషి చేశారన్నారు. పార్టీకి, ప్రజాసేవకు నిరంతరం కష్టపడిన వ్యక్తి వెంకట్‌రెడ్డి అన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వం గ నాగిరెడ్డి, నాయకులు వేముల వెంకట్‌రెడ్డి, రాజ నర్సు, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నంగునూరు ఏఎంసీ చైర్మన్ సారయ్య, ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, మండలాధ్యక్షుడు లింగం గౌడ్ తదితరులు నివాళులర్పించారు.