మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలపై కొద్దిసేపు చర్చించారు.
ఈ సందర్భంగా మెదక్‌లో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు పార్టీలోకి రావాలని శశిధర్‌రెడ్డిని ఆహ్వానించగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన మంత్రికి తెలిపారు.