ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల్లో పూజలు చేశారు. మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు ముందుకు వచ్చిన పదోతరగతి టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
గజ్వేల్‌లో బీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్ ఇద్దరు అనాథ చిన్నారులకు ఆర్థిక సాయం చేయగా, జహీరాబాద్‌లో బీఆర్ఎస్ నేత నామ రవి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్న హరీశ్‌రావుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరూ దేవుడిని మొక్కుకున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్(ఉమ్మడి మెదక్ జిల్లా), జూన్ 3
హ్యాట్సాప్ హరీశ్ అన్న
-హరీశ్‌రావు అభిమానాన్ని చాటుకున్న ఆంధ్రావాసి
సిద్దిపేట, జూన్ 3: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గుళ్లపల్లి వెంకట్రామయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. అతను సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. హరీశ్‌రావు చేసిన అభివృద్ధి గురించి తెలియజేశాడు. గుజరాత్ మోడల్ కాదు.. సిద్దిపేట మోడల్ అవసరం అంటూ పేర్కొన్నాడు. భవిష్యత్తు నాయకులు హరీశ్‌రావును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేను ఆంధ్రా వ్యక్తిని, కానీ.. తెలంగాణ ఇంత అందంగా ఉంటుందని సిద్దిపేట చూసే వరకూ తనకు తెలియదని.. ఇకడ సీఎంలు, పీఎంలు ఉండరు.. హరీశ్ రావు ఒకడే.. హాట్సాప్ హరీశ్ అన్న.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని గుళ్లపల్లి వెంకట్రామయ్య సోషల్‌మీడియాలో స్టేటస్‌గా హరీశ్‌రావు గురించి పేర్కొన్నారు.
అభిమానం.. ఉచిత ఆటో ప్రయాణం
నంగునూరు, జూన్ 3: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఓ ఆటోవాలా వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నాడు. హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తన ఆటోలో ప్రయాణికులకు రోజంతా ఉచిత ప్రయా ణ సౌకర్యాన్ని కల్పించి తన అభిమానా న్ని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కొండంరాజుపల్లికి చెందిన ఆటోవాలా అయిలయ్య కొం డంరాజుపల్లి నుంచి సిద్దిపేట వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాడు.
టాటూ వేసుకున్న అభిమాని
సిద్దిపేట జిల్లా మండలంలోని పాలమాకులకు చెం దిన పల్లపు చిన్నా (సర్వేశ్) అనే యువకు డు తన చేతిపై హరీశ్‌రావు టాటూ వేసుకొ ని తన అభిమానాన్ని చాటుకున్నా డు. హరీశ్‌రావు పుట్టినరో జు సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేయాలని హరీటాటూ వేయించున్నట్లు తెలిపారు.