సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 21: సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆరు గ్యారెంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినందున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కొంత జాప్యం జరిగిన విష యం నిజమేనన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, విద్యా, వైద్యం, సీజనల్ వ్యాధులు, తాగునీరు, రుణమాఫీ, నూతన రుణాల పంపిణీ, చేనేత కార్మికుల సమస్యలు, గృహజ్యోతి పథకం, ఆర్టీసీ, విద్యాశాఖ, మున్సిపల్, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, దేవాదాయశాఖ వనమహోత్సవ్, నిమ్జ్ భూసేకరణపైశాఖల వారీగా సమీక్షించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దేవాదాయ భూములు అన్యక్రాంతం కాకుండా సంరక్షించాలని సూచించారు.
అంతకుముందు కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. కలెక్టరేట్ క్యాంటీన్‌ను మంత్రులు ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇం దిరా మహిళాశక్తి రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మాలాజగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎంపీలు రఘునందన్‌రావు, సురేశ్షెట్కర్, ఎస్పీ రూపేశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సంజీవరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.