రేగోడ్, అక్టోబర్ 28: పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలం లింగంపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ్‌కుమార్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
అజ్జమర్రి వంతెనకు రూ.70 కోట్లు, నర్సింగ్ కాలేజీకి రూ.40 కోట్లు మంజూరు చేశామన్నారు. రహదారులపై జరిగే ప్రమాదాల దృష్ట్యా ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఒక ట్రా మా సెంటర్ ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. కంకోల్, జోగిపేట, నిజాంపేటలో ట్రామాసెంటర్లు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం వైద్యం, విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వట్పల్లిలో 30పడకల దవాఖానకు రూ.12 కోట్లు మంజూరు చేశామన్నారు. కులగణన చేసిన తర్వాతే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించిన వెం టనే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభు త్వానిదేనన్నారు. ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో సీతారావమ్మ, కాం గ్రెస్ మండలాధ్యక్షులు దిగంబర్‌రావు, శేషారెడ్డి, పీసీసీ నేత కిషన్, మాజీ జడ్పీటీసీలు యాదగిరి, రాజేందర్ పటేల్, రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ నరేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యామ్‌రావు, రాధాకిషన్, శ్రీధర్‌గుప్తా, ఫా జిల్, శంకరప్ప, సంగమేశ్వర్ పాల్గొన్నారు.
అల్లాదుర్గం,అక్టోబర్ 28: విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని చిల్వెర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని హెచ్ఎం మంత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు సంగమేశ్వర్, బలరామ్, బాలకిషన్, అంజాగౌడ్, నర్సింహారెడ్డి, మహే శ్, సదానందం పాల్గొన్నారు.
మనూరు, అక్టోబర్ 28: పైప్‌లైన్ పనుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతతో చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్‌శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ సంజీవరెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బోరంచ నల్ల పోచ మ్మ ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ నూరు మండలం బోరంచ, రేగోడ్ మండలం సిందోల్ తాటిపల్లి, లింగంపల్లితో పాటు పలుగ్రామాలకు సాగునీరు అందించేందుకు పను లు ప్రారంభించినట్లు తెలిపారు.
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతోఎత్తిపోతల పథకానికి రూ.7కోట్ల 40లక్షలు మం జూరు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. అం తకు ముందు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేకు ఆలయం వద్ద స్వాగతం పలికారు. బోరచ నల్లపోచమ్మ, సాంభశివుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం లో ఈఈ విజయ్‌కుమార్, డీఈఈ జలేందర్, ఏఈ విద్య, ఆర్డీవో అశోక్ చక్రవర్తి, తహసీల్దార్ వెంకటస్వామి, నాయకులు డిగంబర్రెడ్డి, బ్రహ్మనందరెడ్డి, రాజు పాల్గొన్నారు.