మునిపల్లి,అక్టోబర్ 6 : ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలంలోని కంకోల్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించే ట్రామా హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. అవసరమైన చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధేరా చౌరస్తాకు నూతన రేషన్ దుకాణం మంజూరు చేయాలని స్థ్థానికులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మునిపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్రావును మంత్రి దామోదర రాజనర్సింహ పరమర్శించారు.